వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు

57చూసినవారు
వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు
నల్గొండ జిల్లా నేరేడుగొమ్ము మండలం బుగ్గతండాలో వీధి కుక్క దాడి చేసిన ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. తండాకు చెందిన చోటు అనే బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. వెంటనే బాలుడిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం హైదారాబాద్ తరలించారు.

సంబంధిత పోస్ట్