దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం తెల్లవారుజామున పుట్టిన పసికందుకు అస్వస్థత ఉందంటూ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు శిశువును హైదరబాద్ తరలించగా అప్పటికే శిశువు మృతి చెందింది. ప్రసవ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ శిశువు కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కాగా మంగళవారం మర్రి చెట్టు తండాకు చెందిన నందిని ప్రసవం కోసం ఏరియా ఆసుపత్రికి వచ్చింది.