దేవరకొండ: రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వ లక్ష్యమని ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే బాలు నాయక్ లు అన్నారు. గురువారం డిండి, చందంపేట, నేరేడుగొమ్ము మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పెద్దమునిగల్ లో ఓ మిర్చి బండి వద్ద బజ్జీలు తిని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, సిరాజ్ ఖాన్, యుగేందర్ రెడ్డి, కృష్ణయ్య, ఏడుకొండలు, సంభందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.