దేవరకొండ: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

53చూసినవారు
దేవరకొండ: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించి, కనీస వేతనం 26 వేలు నిర్ణయించి, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి నల్లా వెంకటయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం గ్రామపంచాయతీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త టోకెన్ సమ్మెలో భాగంగా దేవరకొండ ఎంపీడీవో కార్యాలయం ఎదుట సమ్మె నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, మల్లయ్య, లక్ష్మి, పుష్పలత, బయన్న, పార్వతమ్మ, రాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్