దేవరకొండ: కొనసాగుతున్న నిరసనలు

55చూసినవారు
దేవరకొండ: కొనసాగుతున్న నిరసనలు
నల్గొండ జిల్లా దేవరకొండలో ఎల్ఐసి ఏజెంట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఎల్ఐసి కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొన్నారు. ప్రీమియం రేట్లు తగ్గించి, బోనస్ రేట్లు పెంచాలని, క్లా బ్యాక్ కమిషన్ సిస్టంను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఇటీవల తీసుకున్న నిర్ణయాలు ఏజెంట్ల మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని, డిమాండ్ అంగీకరించే దాకా నిరసనలు కొనసాగుతాయని ఏజెంట్ నేతలు అన్నారు.

సంబంధిత పోస్ట్