దేవరకొండ: ఆశ వర్కర్ల భారీ ర్యాలీ

50చూసినవారు
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం ఈనెల 15న సిఐటియు ఆధ్వర్యంలో ప్రారంభమైన రాష్ట్ర వ్యాప్త బస్సుయాత్ర మంగళవారం దేవరకొండకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆశాలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నాయకులు భూపాల్, జయలక్ష్మిలు మాట్లాడుతూ ఆశాలకు కనీస వేతనం రూ. 18 వేలు ఇచ్చి, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రమోహన్, లక్ష్మీనారాయణ, మహేశ్వరి, వెంకటమ్మ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్