దేవరకొండలో గురువారం ఎమ్మార్పీఎస్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేత ముదిగొండ ఎల్లేష్ మాదిగ మాట్లాడుతూ అంచెలంచెలుగా ఎదుగుతున్న చందంపేట మండలానికి చెందిన మాదిగబిడ్డ కిన్నెర హరికృష్ణ ఎదుగుదలను ఓర్వలేని కొందరు అగ్ర వర్ణాలు ఆయనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హరికృష్ణపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్య ముందుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర నేతలు తదితరులు పాల్గొన్నారు.