ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ చేశామని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. శుక్రవారం దేవరకొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆగస్టు 15లోపు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీష్ రావు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసి తీరుతామని ఎమ్మెల్యే అన్నారు.