వైద్యం వికటించి వ్యక్తి మృతి

12147చూసినవారు
వైద్యం వికటించి వ్యక్తి మృతి
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం నంభాపురం తండాలో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం వైద్యం వికటించి భీమా నాయక్ (45) అనే వ్యక్తి మృతి చెందాడు. గత రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న భీమా నాయక్ వైద్యం కోసం స్థానిక ఆర్ఎంపి వైద్యుడి వద్దకు వెళ్లగా ఇంజక్షన్ ఇచ్చాడు. ఇంజక్షన్ ఇచ్చిన కొద్ది సేపటికే భీమా నాయక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం హాలియాకు తరలించగా అప్పటికే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్