ఎమ్మెల్యే బాలు నాయక్ గురువారం చందంపేట మండలంలో పర్యటించనున్నారు. ఉదయం 11. 30 గంటలకు లెడ్పతండ నుండి కోరట్ల వరకు రూ. 2. 25కోట్లతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంఖుస్థాపన, మధ్యాహ్నం 12 గంటలకు కోరట్ల గ్రామ పంచాయతీ పరిధిలో కంబాలపల్లి పిడబ్ల్యుడి రోడ్డు నుండి కోరట్ల వరకు రూ. 80 లక్షలతో నిర్మించనున్న రోడ్డు పనులకు శంఖుస్థాపన చేయనున్నట్లు క్యాంప్ కార్యాలయ వర్గాలు బుధవారం ప్రకటనలో తెలిపాయి.