నేరేడుగొమ్ము మండలం పెద్దమునిగల్ ప్రాథమిక పాఠశాలలో శనివారం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశానికి ఎంఈఓ. రఘు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు అధిక సంఖ్యలో హాజరై పాఠశాల, విద్యార్థుల అభివృద్ధిపై చర్చించాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని తల్లిదండ్రులు విధిగా తనిఖీ చేసి తగిన సూచనలు ఇవ్వాలని కోరారు.