తహసీల్దార్ లకు గ్రామస్తులు వినతి

1163చూసినవారు
తహసీల్దార్ లకు గ్రామస్తులు వినతి
చందంపేట మండలంలోని పాత కంబాలపల్లి గ్రామంలో భూములున్న రైతులను గుర్తించి ఆ భూములను ధరణి వెబ్ సైట్ నమోదు చేయలని సోమవారం దేవరకొండ ఆర్డిఓ చందంపేట తహశీల్దార్ లకు పాత కంబాలపల్లి గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన ధరణి వెబ్ సైట్ నుండి తొలగించారని, అందులో నిజమైన రైతుల భూములను తొలగించారని వారు పేర్కొన్నారు. మా గ్రామంలో గతంలో కొందరు అధికారులతో కుమ్మక్కై భూములు లేకున్నా ఉన్నట్లు అధికార్లు దొంగ పట్టాలు చేశారని, ఆ పట్టాలు చేసిన అధికారులపై వేటు అనంతరం భూములున్న నిజమైన రైతుల భూముల తొలగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

పలుమార్లు జిల్లా అధికారులు ఆ భూములపై ప్రత్యేక అధికారులను పెట్టి విచారణ చేపట్టి రోజులు గడుస్తున్నా భూములున్న రైతులకు న్యాయం జరగడం లేదని, ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని నిజమైన భూములున్న రైతులను గుర్తించి ధరణి వెబ్సైట్ లో భూములను నమోదు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, గ్రామస్తులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్