పట్టణ పరిశుభ్రత అందరి బాధ్యత
దేవరకొండ పట్టణ పరిశుభ్రత మనందరి బాధ్యతని మున్సిపల్ చైర్మన్ నరసింహ కమిషనర్ భాస్కర్ రెడ్డిలు అన్నారు. మంగళవారం పట్టణంలో స్వచ్చత హి సేవ 2024 కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా మాస్ క్లీనింగ్ డ్రైవ్, స్వచ్చత ప్లెడ్జ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రహత్ అలి, కౌన్సిలర్లు, కౌన్సిలర్లలు, పురపాలక సిబ్బంది, మహిళా సంఘాలు, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.