ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ

73చూసినవారు
ప్రధాని మోడీకి శుభాకాంక్షల వెల్లువ
ప్రధాని నరేంద్రమోడీ 74వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన రాజకీయ నేత, వన్‌ ఇండియా- బెస్ట్‌ ఇండియా దార్శనికుడైన ప్రధాని మోడీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ పలువురు సీఎంలు శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్