
దేవరకొండ: హామీల అమలు కోసం ప్రజల తరపున కొట్లాడుతాం
దేవరకొండ: 420 దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 420 రోజులు పూర్తైన హామీలు అమలు చేయడం లేదంటూ గురువారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. అనంతరం మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హామీల అమలుకై ప్రజల తరపున కొట్లాడుతామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, టీవీఎన్, గాజుల, లింగారెడ్డి తదితర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.