Sep 15, 2024, 07:09 IST/
బంకులో పెట్రోల్ బదులు వాటర్.. భగ్గుమన్న వినియోగదారులు (వీడియో)
Sep 15, 2024, 07:09 IST
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హస్తినాపురం జెడ్పీ రోడ్డులో ఉన్న HP పెట్రోల్ బంకులో ఘరానా మోసం బయటపడింది. ఆ బంకులో పెట్రోల్‌కి బదులు నీరు రావడంతో వాహనదారులు అవాక్కయ్యారు. కొంతమంది వాహనదారులు పెట్రోల్ కొట్టించుకోడానికి వెళ్లగా గన్ నుంచి నీరు వచ్చింది. దీంతో బంక్ యజమానులను ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారని వాహనదారులు మండిపడుతున్నారు. వెంటనే పెట్రోల్ బంకును సీజ్ చేసి వాహనదారులకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు.