కేతేపల్లి మండలంలోని మూసి ప్రాజెక్ట్ ద్వారా సూర్యపేట, నల్లగొండ జిల్లాలోని దాదాపు 48 వేల ఎకరాల భూములు సాగుతున్నాయి, నల్లగొండ జిల్లాలోని రెండో అతిపెద్ద ప్రాజెక్టు అయిన మూసి ప్రాజెక్ట్ యొక్క రక్షణ గోడకు రంద్రాలు ఏర్పడి నీరు వృధాగా కిందికి వెళుతుంది. అధికారులు స్పందించి మూసి ప్రాజెక్ట్ రక్షణ గోడకు మరమ్మతులు చేసి నీటి వృధాను అరికట్టాలని ఆదివారం రైతులు కోరుతున్నారు.