కోదాడ: సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి
చిలుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కళాశాల లో షీ టీమ్స్ , సైబర్ నేరాలపై విద్యార్థినిలకు ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా చిలుకూరు ఏఎస్ఐ వేంకటేశ్వర రావు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు షీ టీమ్స్ సైబర్ నేరాలపై, గంజాయి, మత్తు పదార్థాలపై పటిష్టంగా పని చేస్తున్నాయన్నారు. విద్యార్థులు ఈ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.