కోదాడ పట్టణానికి చెందిన సూక్ష్మ కళాకారుడు నరేష్ చారి మంగళవారం హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన కొమురం భీమ్ వర్ధంతి సందర్బంగా అంగుళం సుద్ద ముక్కల కొమురం భీమ్ ప్రతిమను చెక్కి తన కళాత్మకతను చాటుకున్నాడు. చారి గతం లో సూక్ష్మ వస్తువులు బియ్యపు, పప్పు గింజల పై జాతీయ నాయకుల, దేవుళ్ళ ప్రతిమలు చెక్కాడు. సూక్ష్మ వస్తువుల పై అద్భుత కళాఖండాలు సృష్టిస్తున్న సూక్ష్మ కళాకారుడు నరేష్ చారిని పలువురు అభినందించారు.