నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్ లో గురువారం బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ (25 ఆగస్టు1894 నుండి 19 డిసెంబర్ 1967) 57వ వర్ధంతి కార్యక్రమంను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో-కన్వీనర్ లు దాసరాజు జయరాజు, చేగొండి మురళీ యాదవ్, టీడీపీ నల్గొండ పార్లమెంట్ బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, తదితర బీసీ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.