గాయపడిన విద్యార్థులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే

68చూసినవారు
గాయపడిన విద్యార్థులకు భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే
మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామంలో మంగళవారం ఉదయం బ్రేక్ ఫెయిలై సిటీ సెంట్రల్ స్కూల్ బస్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ సూపరిండెంట్, వైద్యులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్