రాబోయే వేసవి కాలంలో ఎటువంటి తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి రాకుండా ఇప్పటినుండే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శనివారం మునుగోడులోని తన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో మునుగోడు నియోజకవర్గం లో మళ్లీ ఫ్లోరైడ్ జాడలు బయటపడుతున్నాయని నాణ్యమైన త్రాగునీరు అందించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులని ఆదేశించారు.