మునుగోడు: గొలుసుకట్టు చెరువుల లింకు నాళాలను పునరుద్ధరించాలి

60చూసినవారు
మునుగోడు నియోజకవర్గంలో చిన్న నీటి వనరులను పటిష్ట పరచడానికి సమగ్రమైన కార్యాచరణ రూపొందించి పనులను మొదలుపెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో హైదరాబాదులోని తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యధిక ఫ్లోరైడ్ రక్కసివున్న ప్రాంతం మునుగోడు అని అన్నారు. ఇక్కడ కురిసే ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టి చెరువులకు మళ్ళించినట్లయితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్