ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా: మాజీ ఎమ్మెల్యే జూలకంటి

1789చూసినవారు
ప్రభుత్వానికి ప్రజా సమస్యలు పట్టవా: మాజీ ఎమ్మెల్యే జూలకంటి
నాగార్జునసాగర్ ఎడమ కాలువ కట్టలు అస్తవ్యస్తంగా మారాయని ప్రభుత్వానికి, ఎన్ ఎస్పీ అధికారులకు కళ్ళు కనిపించడం లేదా అని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. ఆదివారం మండలంలోని ఇలాపురం, అన్నపురెడ్డిగూడెం గ్రామాలలో ఉన్న అస్తవ్యస్తంగా ఉన్న ఏడవ కాలువ కట్టలను రైతులతో కలిసి పరిశీలించారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు కాలువలలో నడిచి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. లిఫ్టులను పరిశీలించారు. ప్రమాదకరంగా ఉన్న యాద్గారి పల్లి మేజర్ కాల్వ కట్టను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఎడమ కాలువ ఆయకట్టు లైనింగ్ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. కాల్వ ఆధునికరణ పనులు పూర్తిస్థాయిలో చేపట్టలేదని కాల్వ మధ్య, మధ్యలో లైనింగ్ పనులు వదిలేసారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, సహయ కార్యదర్శి రాగిరెడ్డి మంగారెడ్డి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతంరెడ్డి, వేములపల్లి వైసీపీ పాదూరి గోవర్ధన, రైతు సంఘం జిల్లా నాయకులు పాల్వాయి రామ్ రెడ్డి, కోట్ల శ్రీనివాస్ రెడ్డి, సీఐటీయూ జిల్లా నాయకులు రొంది శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా నాయకులు పొలేపల్లి గోవింద్ రెడ్డి, లిఫ్ట్ చేర్మెన్ పూర్ణచందర్రావు, ప్రణీత్ రెడ్డి, పొదిలా వెంకన్న, మల్లయ్య, కోడైరెక్క మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్