త్రిపురారం మండలం పరిధిలోని బొర్రాయి పాలెం గ్రామంలోని శ్రీ దేవి భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నూతనంగా శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. సాగర్ శాసన సభ్యులు కుందూరు జయ వీర్ రెడ్డి స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాటూరు మాజీ సర్పంచ్ వాంకుడోత్ పాండు నాయక్ స్వామి ఆధ్వర్యంలో స్వాములు పాల్గొని, మర్యాద పూర్వకంగా కలిశారు.