మున్సిపల్ ఆఫీస్ ముందు నిద్రపోతూ నిరసన

50చూసినవారు
మున్సిపల్ ఆఫీస్ ముందు నిద్రపోతూ నిరసన
మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ తన విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆఫీసులోనే నిద్రపోవడం బాధాకరమని సమాచార హక్కు చట్టం రాష్ట్ర అధ్యక్షుడు సరికొండ రిషికేశ్వర రాజు, చిలుముల కొండల్ అన్నారు. కమిషనర్ తన చాంబర్లో నిద్రిస్తున్న ఫోటో దినపత్రికలో వచ్చిందని, ఆయన బాధ్యత రాహిత్యాన్ని నిరసిస్తూ శుక్రవారం మున్సిపల్ ఆఫీస్ ముందు నిద్రపోతూ నిరసన తెలిపారు. కమిషనర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్