బ్రాహ్మణవెల్లంల గ్రామ శివారులోని ఉదయ సముద్రం ప్రాజెక్ట్ లో శనివారం సాయంత్రం వ్యక్తి గల్లంతయిన విషయం తెలిసిందే. గల్లంతైన వ్యక్తి నార్కట్ పల్లి మండలం అప్పాజీపేట గ్రామానికి చెందిన శంకరయ్యగా గుర్తించారు. రిజర్వాయర్ చూడటానికి వచ్చి సరదా కోసం దిగటంతో మోటర్ వాటర్ ప్రవాహానికి కొట్టుకుపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. సిడీఆర్ఎఫ్ సిబ్బంది ఆదివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు.