తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు సమాచార హక్కు చట్టం కింద ప్రతి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తున్నాయని తెలుసుకోవడానికి కేతేపల్లి మండలం చెరుకుపల్లి గ్రామంలో గ్రామ కార్యదర్శి లక్ష్మీనారాయణ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పిట్టల వెంకట్, మండల యువమోర్చా అధ్యక్షులు జటంగి సైదులు, మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి మంగ సతీష్, ఉపాధ్యక్షులు లింగాల నరేష్, బీజేవైఎం మండల నాయకులు బయ్య శ్రీనివాస్, చెరుకుపల్లి బూత్ అధ్యక్షులు మల్లె బోయిన శంకర్ తదితరులు పాల్గొన్నారు.