సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామ శివారులోని ఎంపీఎల్ కంపెనీ మైదానంలో, ఈ నెల 4న చిట్యాల ప్రీమియర్ లీగ్-4 ప్రారంభమైంది. ఈ లీగ్ లో భాగంగా ఎస్ఎస్ 11, SWAMY 11 టీమ్స్ మధ్య గురువారం జరిగిన క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.