కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో ఐదవ రోజు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకు శ్రీ లలీతా త్రిపుర సుందరీ దేవి అవతారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో శ్రీ లలీతా త్రిపుర సుందరీ దేవి పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.