నియోజకవర్గ ప్రజలకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంగళవారం మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగ నియోజకవర్గ ప్రజల జీవితాలలో సరికొత్త కాంతిని నింపాలని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.