నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలలో చిరుమర్తి తిరుపతమ్మ అనారోగ్యంతో బుధవారం మరణించింది. విషయం తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య ఆమె భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి ప్రగాఢ సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు 5వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బొడిగే నరసింహ, చిరుమర్తి ధర్మయ్య, చిరుమర్తి ఉపేందర్, చిరుమర్తి అశోక్, చిరుమర్తి నరసింహ పాల్గొన్నారు.