ఇప్పటికే 55 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే చేశామని, ఇప్పుడు మరో 10 రోజుల పాటు అవకాశం కల్పిస్తున్నామని అందరూ సహరించి సర్వే పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండలో కుల గణనపై బీజేపీ నాయకుల మాటలపై స్పందిస్తూ మేము సర్వే పారదర్శకంగా పూర్తి చేశామని, అయినా ఎన్నికలు వాయిదా వేసి మళ్ళీ అవకాశం ఇచ్చామన్నారు.