నల్గొండ జిల్లాలో బుధవారం భారీ వర్షం కురిసింది. దీంతో వీధులన్నీ జలమయమయ్యాయి. కుండపోత వర్షం కురియడంతో పట్టణ ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురైయ్యారు. వీధులన్నీ జలమయం కావడంతో పాటు రోడ్ల పై వరద నీరు పొంగి ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. దీపావళి టపాసుల దుకాణాల యజమానులు కూడా భారీ వర్షానికి సరుకు తడిసిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నప్పటికీ కొంత సరుకు తడిచి నష్టపోయారు.