నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మగూడెంలో జననీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ పరిధిలోని ఇంటింటికీ నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని,అత్యవసరం అయితే తప్ప బయట తిరుగొద్దన్నారు. ఈ కార్యక్రమంలో నాగయ్య, లింగస్వామి, కోటేష్, నవీన్ రెడ్డి, సాయి భరత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.