నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో బుధవారంం మునిసిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు సరైన వేతనం అందించి పిఎఫ్, ఈఎస్ఐ అమలు చేయాలన్నారు.