నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో గురువారం జరిగిన భారతీయ జనతా పార్టీ మండల సర్వ సభ్య సమావేశంలో నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కనగల్ మండల ప్రధాన కార్యదర్శిగా అవురేషి ముత్తయ్య, కార్యదర్శిగా భైరవోని అశోక్ లు ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నిర్దేశించిన అంశాలను పార్టీ బలోపేతానికి మండలంలో తమవంతు కృషి చేస్తామని తెలిపారు.