ఎంబిబిఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం

77చూసినవారు
ఎంబిబిఎస్ విద్యార్థినికి ఆర్థిక సహాయం
నల్గొండలోని 47వ వార్డుకు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి నిమ్మ యశ్వనితకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం రూ. 60 వేల ఆర్థిక సహాయం అందజేశారు. హనుమకొండలో ఎంబిబిఎస్ రెండవ సంవత్సరం చదువుతున్న యశ్వనిత పేద కుటుంబం కావడంతో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి వెంటనే స్పందించి యశ్వనిత చదువు కోసం రూ. 60 వేల ఆర్థిక సహాయాన్ని విద్యార్థిని తల్లి మంగకు అందజేశారు.

సంబంధిత పోస్ట్