ప్రజా సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టకుండా కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నారని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం అన్నారు. శుక్రవారం దొడ్డి కొమురయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధిని గాలికి వదిలేసి ప్రజా సమస్యల పరిష్కారం గురించి ఆలోచించకుండా కాంగ్రెస్ బిఆర్ఎస్ లు తిట్ల పురాణం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అన్నారు.