అంకితభావం, కష్టపడే మనస్తత్వం ఉంటే ఏరంగంలోనైనా రాణించవచ్చని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ లో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళ అభ్యర్థుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. జీవితంలో ఎవరిపై ఆధారపడకుండా స్వశక్తితో జీవించాలని, అయితే ఏ రంగంలోనైనా పోటీ సాధారణమని అన్నారు