డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలి

76చూసినవారు
నల్గొండ పట్టణంలో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్ ఆవుట రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం డబల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర జరుగుతున్న పనులు పరిశీలించడానికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నెలలో సిపిఎం చేపట్టిన ఆందోళన ఫలితంగా కలెక్టర్ జనవరి 15 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్