మాడుగులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్ అవుట్ పాల్ వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యం అయ్యింది. ఎస్సై ఎస్ కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మెరూన్ కలర్ టాప్, రెడ్ కలర్ లెగ్గిన్ దుస్తులు గల (25, 30) గుర్తు తెలియని మహిళ మృతదేహం పెద్దదేవూలపల్లి రిజర్వాయర్‌లో కొట్టుకొని వచ్చినట్లుగా తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. మహిళా ఆచూకీ తెలిసినవారు 8712670192, 8712670151 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.