మాతృభాషా దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల నందు మాతృభాషా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానా చార్యులు ఎం. నరసింహ మాట్లాడుతూ మాతృభాషను, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు పాల్గొన్నారు.