కేసీఆర్ ఉన్నప్పుడు వెంటనే కూలి పైసలు ఇచ్చేవాడు అని గురువారం ఒక చేనేత కార్మికుడు తెలిపాడు. రేవంత్ రెడ్డి చీరలు ఇచ్చిన తర్వాత కూడా పైసలు ఇవ్వడం లేదు అన్నారు. ఒక్కొక చేనేత కార్మికుడికి రేవంత్ రెడ్డి వల్ల రూ.6 వేలు నష్టం అన్నారు. మార్పు వస్తుందని అందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము. కానీ మాకు ఎలాంటి లాభం లేదు. చేనేత కార్మికులు అయితే కాంగ్రెస్ పార్టీ వైపు ఇంకోసారి తొంగి చూడము అన్నారు.