నల్గొండ జిల్లా ప్రజలకు ముస్లిం సోదర సోదరీమణులకు శనివారం మాల మహానాడు జాతీయ నాయకులు షాలెమ్ రాజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించిన ఈ రంజాన్ మాసంలో నెల రోజులపాటు నియమ నిష్ఠలతో ముస్లింలు కఠిన ఉపవాస వ్రతం ఆచరించి అల్లాహ్ కృపకు పాత్రులవుతారని మరియు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం ఇచ్చే గొప్ప సందేశం అని అన్నారు.