గర్భినీ స్త్రీల గర్భస్థ శిశు పరీక్షలకు సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న ఏ ఎన్ సి భవనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రాఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఆదివారం అయన నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆంటినేటల్ పరీక్షల భవన పనుల నిర్మాణానికి పూజ చేశారు. పనులు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని తెలిపారు.