కుల సంఘాల భవనాలు నిరుపేదలకు ఆసరాగా ఉండాలి

61చూసినవారు
కుల సంఘాల భవనాలు నిరుపేదలకు ఆసరాగా ఉండాలి
మిర్యాలగూడ పట్టణంలోని షాబునగర్ లోని గౌడ సంక్షేమ సంఘం భవనం నిర్మాణం ఆగిపోవడంతో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి 10 లక్షల రూపాయలు ప్రత్యేక నిధులు మంజూరు చేయించి గౌడ సంఘం ఆధ్వర్యంలో భవన పునర్నిర్మాణం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు అందరూ కలిసి కట్టుగా ఐకమత్యంతో ఉండాలని భవన భవన నిర్మాణానికి మా వంతు పూర్తి సహాయసహకారాలు అందిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్