తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు అర్థమైందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. నల్లగొండ బీజేపీ కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ… ‘తాజా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ఎన్నికలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తప్పదని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు తేలిపోయింది. అధికార పార్టీ తమ ఎమ్మెల్సీ అభ్యర్థులను అరువు తెచ్చుకుంది.