ఎంజీయూ స్టాఫ్ క్వార్టర్స్ ప్రారంభించిన ఉపకులపతి

66చూసినవారు
నల్లగొండ జిల్లా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం అధ్యాపకుల గృహ సముదాయాన్ని ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ అధికారులతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు నిత్యం అందుబాటులో ఉండడం ద్వారా విద్యార్థులకు మెరుగైన సేవలతో పాటు నాణ్యమైన పరిశోధనలకు అవకాశం ఉంటుందన్నారు. ఎంజియూ సైతం ఐఐటి తరహా రెసిడెన్షియల్ క్యాంపస్ గా రూపు దాల్చడానికి ఇదొక ముందడుగుగా దోహదపడుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్