నర్వ మండల కేంద్రంలోని ఆయా గ్రామాలలో అధిక వర్షాలతో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో దెబ్బ తినడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి ఎడతెరపి లేని వర్షాలతో వేసుకున్న కంది, పత్తి ఇతర పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి పంట నష్టపరిహారాన్ని రైతన్నలకు అందించాలని రైతులు బుధవారం కోరుతున్నారు.